తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహించగా వర్మ పేరుతొ తెరకెక్కించారు .. అయితే సినిమా బాగా రాలేదన్న ఆలోచనతో ఈ సినిమా నిర్మాతలు దర్శకుడితో పాటు అందరిని మార్చేసి కొత్తగా తీయాలని కొత్త దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు టైటిల్ కూడా మార్చేశారు .. ఇంతకీ కొత్త టైటిల్ ఏమిటో తెలుసా .. ఆదిత్య వర్మ ? టైటిల్ కూడా అర్జున్ రెడ్డి స్టైల్ లోనే ఇంగ్లీష్ లో డిసైన్ చేసారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.